E-Paper
Advertisement

Revanth Tweet : రైతుబంధు పై రేవంత్ ట్వీట్.. అధికారంలోకి రాగానే రూ.15 వేలు

Revanth Tweet : రైతుబంధు పై రేవంత్ ట్వీట్.. అధికారంలోకి రాగానే రూ.15 వేలు
Advertisement

Revanth Tweet : ఎన్నికల కమిషన్ రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి X వేదికగా స్పందించారు. “రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం.” అని రేవంత్ వెల్లడించారు.

మరో ట్వీట్ లో పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని.. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ జోక్యం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

.

.

Advertisement

.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×