// // Congress Victory: రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అభినందనలు -->
E-Paper
Advertisement

Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు
Advertisement

Congress Victory: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇటీవల తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ విజయంపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీని విజయపథంలో నడిపించిన తీరును మెచ్చుకుంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ విజయం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని.. భవిష్యత్తు ఎన్నికలకు ఇది గట్టి పునాది అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని వివరించారు. ఆరు గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలే ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని ప్రియాంక గాంధీకి వివరించారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణతో పాటు.. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతంపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం , పార్టీ మధ్య సమన్వయం పాటిస్తూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను గడువులోపు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

మొత్తానికి.. ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ నింపడమే కాకుండా అధిష్టానంతో రేవంత్ రెడ్డికి ఉన్న బలమైన సంబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.

Also Read: శ్రమ నీది.. అండ మాది.. కోవా బన్ వ్యాపారికి సోషల్ మీడియా సెల్యూట్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×