E-Paper
Advertisement

Revanth Reddy: ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు.. 25మంది కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ గాలం.. రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy: ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు.. 25మంది కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ గాలం.. రేవంత్ రెడ్డి ఆగ్రహం
Advertisement

Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టింది బీజేపీ కోసమేనన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకే బీఆర్ఎస్ తో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు. కర్నాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ బేరసారాలు చేశారని అన్నారు. వాళ్లకు 500 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని చెప్పారు. తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్‌ పెట్టుకుని కేసీఆర్ ఈ ఆపరేషన్‌ చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. సదరు నేతకు చీవాట్లు పెట్టిందని తెలిపారు. సునీల్‌ కనుగోలు రిపోర్టును దొంగిలించి కేసీఆర్‌ ఈ పనిచేశారని మండిపడ్డారు. సునీల్‌ కనుగోలు ఆఫీసుపై దాడి వెనుక చాలా కారణాలున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణం అని అన్నారు.

Advertisement

కర్నాటకలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సర్వేలు అన్ని చెబుతున్నాయని రేవంత్‌ చెప్పారు. కాంగ్రెస్‌కు 125 నుంచి 130 సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టకుండా.. 100 లోపే సీట్లు వచ్చేలా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు. అలాగే, సీఎం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

ఢిల్లీ మద్యం స్కామ్‌లో బీఆర్ఎస్, ఆప్‌ నేతలు భాగస్వాములని.. అందుకే ఒకే వేదికపై కనిపించారని విమర్శించారు. దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న కేసీఆర్‌.. గుజరాత్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏళ్ల తరబడి మోదీతో కేసీఆర్‌ అంటకాగారని విమర్శించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×