E-Paper
Advertisement

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా
Advertisement

Telangana New Pensions: కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. గ్రామసభల్లో ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండడంతో వడపోసి అర్హులకు పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Advertisement

కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి శుభవార్త చెప్పింది రేవంత్ ప్రభుత్వం. చేయూత పథకం కింద కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్‌లో రూ.233 కోట్లను కేటాయించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షురూ అయ్యింది.

గడిచిన ప్రభుత్వం లక్షలాది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఆ సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పుడు అర్హులను గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలో దాదాపు 42 లక్షలకు పైగానే పెన్షన్లు పొందుతున్నారు. అందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులు ఉన్నారు.

Advertisement

కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా గుర్తింపు ప్రయత్నాలు

ఒకొక్కరికి నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం చేయూత నిస్తోంది. దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.4,016గా అందజేస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో 2 లక్షల మంది చేరనున్నారు. గడిచిన మూడేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడంతో బోదకాలు, డయాలసిస్ బాధితులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

బడ్జెట్‌లో కొత్త పెన్షన్ల ప్రకటన తర్వాత ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఇప్పటికే 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికితోడు కొత్త దరఖాస్తులు రానున్నాయి. ఈ నేపథ్యంలో 2 లక్షల మంది అర్హుల ఎంపిక అధికారులు కత్తిమీద సాములా మారింది.

ALSO READ: వీకెండ్ మస్త్ మజా.. డ్రగ్స్ నిషా.. చేవెల్లలో అక్రమ ఫామ్ హౌస్‌ల హల్చల్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×