E-Paper
Advertisement

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?
Advertisement

Vigilance Probe: స్వేచ్చ బ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) లో ఒక డైరెక్టర్ స్థాయి అధికారి పదవీ విరమణ పొందినప్పటికీ, ఆయనకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోవడం ఇప్పుడు సంస్థలో తీవ్ర సంచలనంగా మారింది. గతంలో ఆయన చేసిన వివాదాస్పద నిర్ణయాలే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారాయి. సదరు డైరెక్టర్ స్థాయి అధికారి తన పదవీ కాలంలో అప్పటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అడ్డగోలు బదిలీలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 15 నుంచి 20 మంది అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం.

కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు

ఈ బదిలీల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అర్హులను పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే విచారణ పూర్తయి దీనిపై యాక్​షన్ తీసుకోవాల్సి ఉండగా.. ఈ ఇష్యూను పక్కన పెట్టేశారనే ఆరోపణలున్నాయి. తీరా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో విచారణ సాగుతోంది. ఇదిలా ఉండగా సదరు డైరెక్టర్ స్థాయి అధికారి ఈ ఇష్యూను తొక్కి పెట్టేందుకు కొత్త సీఎండీని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారనే చర్చ జరుగుతోంది. అయితే.. చీఫ్​ ఇంజినీర్ గా సర్వీసులో ఉండగానే సదరు అధికారి డైరెక్టర్ గా నియామకమయ్యారు. సీఈగా మే 31న రిటైర్ అయ్యారు. డైరెక్టర్ గా మరో ఏడాదికాలం పాటు కొనసాగనున్నారు.

నిభందనలు ఉల్లంగన..

Advertisement

సదరు అధికారి బదిలీల పేరిట సాగించిన ఈ అక్రమ పర్వంపై సంస్థలోని ఇంజినీర్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై పూర్తి ఆధారాలతో సహా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు ఆ సంఘాల ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, నిబంధనలను ఉల్లంఘించిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇంజినీర్ సంఘాల ఫిర్యాదును కేంద్ర మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

రిటైర్మెంట్ బెనిఫిట్స్ బంద్..

Advertisement

కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో, తెలంగాణ సీఎస్ ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో, ఎస్పీడీసీఎల్ లోని మరో ఉన్నతాధికారి ఈ ఫైలుపై గట్టిగా దృష్టి పెట్టారు. విచారణ పెండింగ్‌లో ఉన్నందున సదరు రిటైర్డ్ డైరెక్టర్‌కు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకూడదని భావించి, ఆయనకు రావాల్సిన హెచ్ఆర్ క్లియరెన్స్ ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ తేలే వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు..

ఇదే సమయంలో ఎస్పీడీసీఎల్ లో నాయకత్వ మార్పులు జరిగాయి. పాత సీఎండీ స్థానంలో కొత్త సీఎండీ బాధ్యతలు చేపట్టారు. పాత యాజమాన్యం హయాంలో జరిగిన ఈ వివాదాస్పద వ్యవహారానికి, విచారణ ఎదుర్కొంటున్న ఫైళ్లకు కొత్త సీఎండీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో సదరు అధికారికి సంబంధించిన బెనిఫిట్స్ ఫైల్ పూర్తిగా పక్కన పడిపోయింది. తమ శాఖ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, సదరు రిటైర్డ్ డైరెక్టర్ స్థాయి అధికారి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా అయినా క్లియర్ చేయించుకోవాలనే తాపత్రయంతో ఆయన ప్రస్తుతం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నతాధికారులను, రాజకీయ ప్రముఖులను కలిసి తన ఫైలును ముందుకు కదిలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అధికార బలంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్న అధికారి, నేడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సచివాలయం మెట్లు ఎక్కడంపై ఎస్పీడీసీఎల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×