E-Paper
Advertisement

Sharmila: షర్మిలకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Sharmila: షర్మిలకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
Advertisement
sharmila jail

Sharmila: అనుకున్నదొక్కటి అయినది ఇంకోటి. సిట్ కార్యాలయం ముట్టడిద్దామనుకున్నారు షర్మిల. కానీ, ఆమెను ఇంటి నుంచి బయటకే రానివ్వలేదు పోలీసులు. తననే అడ్డుకుంటారా అంటూ ఖాకీలపై శివాలెత్తారు షర్మిల. ఓ ఎస్సైని తోసేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను కొట్టారు. పోలీసులపైకి కారును నడిపించారు. కట్ చేస్తే.. షర్మిల అరెస్ట్. 14 రోజుల రిమాండ్.

పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మే 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచాలని.. చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. షర్మిల జైలు కెళ్లడం ఆ పార్టీ శ్రేణులకు షాకింగ్ పరిణామం.

Advertisement

అంతకుముందు, ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. కొత్త సచివాలయం ముట్టడి చేపడతారనే అనుమానంతో షర్మిలను హౌజ్ అరెస్ట్ చేసేందుకు ఆమె ఇంటికి వచ్చారు పోలీసులు. ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన షర్మిల.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం, గొడవ, దాడికి దిగారు. షర్మిలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు.

షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పీఎస్‌లోకి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ కూడా చేయిచేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేశారని నిలదీశారు. పోలీసులు విజయమ్మను బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు. భర్త అనిల్‌ను మాత్రం షర్మిలను కలిసేందుకు అనుమతించారు.

Advertisement

ఇక, షర్మిల పోలీసులను కొట్టడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ 353, 332, 503, 427 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు, షర్మిల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. షర్మిల లాయర్లు వెంటనే బెయిల్ పిటిషన్ వేయగా.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. దీంతో, షర్మిల జైలుకు వెళ్లక తప్పలేదు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×