E-Paper
Advertisement

Telangana Registrations: తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం.. సర్వర్లలో సాంకేతిక లోపం

Telangana Registrations: తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం.. సర్వర్లలో సాంకేతిక లోపం
Advertisement

Telangana Registrations: కారణాలు ఏమైనా కావచ్చు.. తెలంగాణలో మంగళవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచి పోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీని కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. మంగళవారం ఉదయం నుంచి సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీని ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్లకు వచ్చిన వినియోగదారులు గంటల తరబడి ఆఫీసుల ముందు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి టెక్నికల్ సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా భూములకు సంబంధించి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది వినియోగదారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి నిరాశతో వెనుదిరిగారు. మరి కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద వెయిట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆ శాఖ అధికారులను జనం నిలదీసిన సందర్భాలు లేకపోలేదు.

Advertisement

సర్వర్లలో సాంకేతిక లోపం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పడిగాపులు

సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ సహా ఏ పని సాగలేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మధ్యాహ్నం రెండు గంటలు గడిచినా అక్కడే ఉన్నారు. ఏ క్షణమైనా పని జరిగిపోవచ్చని భావిస్తున్నారు.

నార్మల్‌గా ప్రక్రియలో నాలుగైదు విభాగాలు కీలకంగా ఉంటాయి. తొలుత డాక్యుమెంట్ విభాగం దానికి కచ్చితంగా నెట్ వర్క్ ఉంటేనే పని వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ విధానంలో అన్నీ పరిశీలన చేస్తారు. చివరిగా సబ్ రిజిస్ట్రార్ వద్ద ఆయా దస్త్రాలు వెళ్తాయి. సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వచ్చిన వారు సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయని అడుగుతున్నారు.

ALSO READ: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే

పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో కొంతమంది ప్రజలు వాగ్వాదానికి దిగిన సందర్భాలు కనిపించాయి. టెక్నికల్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. సర్వర్ మొరాయింపులను సరి చేసేందుకు ఆయా టీమ్‌లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వేగంగా సేవలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నాయి. సాధారణ స్థితికి వస్తుందో తెలియక అక్కడికి వచ్చిన వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×