E-Paper
Advertisement

పత్తి పంటకు గుడ్‌బై.. గద్వాల రైతులలో ఊహించని బిగ్ చేంజ్!

పత్తి పంటకు గుడ్‌బై.. గద్వాల రైతులలో ఊహించని బిగ్ చేంజ్!
Advertisement

Kharif Cultivation: గత రెండు నెలలుగా వర్షాలు లేక గాలి, ఎండతో ఖరీఫ్ పనులు ఆశించిన స్థాయిలో పురోగతిలేక వరుణ దేవుడు కరుణించకపోవడంతో తొలకరిలో కాస్తోకూస్తో కురిసిన వర్షాలకు నాటిన పత్తి విత్తనాలు మలవక మట్టిలోనే కలిసిపోయాయి. ఇటీవల కురిసిన మోస్తారు వర్షాలకు పూర్తిస్థాయిలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. పత్తి చేలలో విత్తనాలు పెట్టడంతో పాటు మిరప నార్లు పోసుకొని నాటేందుకు సిద్ధంగా ఉన్న మిరప నారుని సైతం ఇదే అదునుగా భావించి పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు నారు నాటారు. ఈ వర్షాలతో వాడు పట్టిన మొక్కలకు జీవం పోయగా చనిపోయిన మొక్కలు స్థానంలో రెండోసారి విత్తనాలు పెట్టారు. గత రెండు నెలలుగా వర్షాల కోసం రైతులు ఎదురు చూపులతోపాటు సకాలంలో వర్షాలు కురవాలని కృష్ణా నది నీటి జలాలను ఎద్దుల బండ్లతో బయలుదేరి గ్రామాలలోని శివునికి పూజలు చేశారు. ఎట్టకేలకు రుతుపవనాలు చురుకుగా కదలడంతో గత పదిరోజుల వ్యవధిలో వర్షాలు కురవడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువెలుస్తోంది.

జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు పంటల పాలిట వరంగా మారాయి జూన్ 1 నుంచి 20 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం ఆశించిన వర్షపాతం నమోదు కావడంతో పూర్తిస్థాయి విస్తీర్ణంలో పంటల సాగు జరుగుతుంది.

పత్తికి ప్రయోజనం

Advertisement

మోస్తారు వర్షాలతో పత్తి పంటలకు జీవం పోసినట్లు అయింది. గడిచిన రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో వాడు దశకు వచ్చాయి. ఆశించిన స్థాయిలో మొలకశాతం సైతం రాలేదు.ప్రస్తుత వర్షాలతో పత్తితో పాటు మిరప l,కంది పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. రానున్న రోజులలో వర్షాలు ఇదే స్థాయిలో కొనసాగితే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది.

Also read: మమ్ములను ఏడిపిస్తారా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జోగిని శ్యామల ఫైర్..!

ఖరీఫ్ పనుల్లో బిజీ బిజీ

Advertisement

అన్నదాతలు ఖరీఫ్ పనుల్లో బిజీ బిజీగా మారారు. జిల్లాలో 3.29 లక్షల ఎకరాలలో ప్రస్తుతానికి లక్ష 7వేల ఎకరాలలో ప్రతి, 24540 ఎకరాలు సీడ్ పత్తి, 966 ఎకరాలలో కంది, 1000 ఎకరాలలో మొక్కజొన్న ఎకరాలలో సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్,తమిళ పరిధిలో వరి సాగుకు రైతుల సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వరి నారును సైతం సాగు చేయగా ప్రస్తుతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల జలాశయం నిండుకుండలా మారడంతో ఇప్పటికే వరి నారుమడులను సిద్ధం చేసుకున్న రైతులు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

పెరగనున్న మిర్చి సాగు విస్తీర్ణం

జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన మిర్చిని సాగు చేసేందుకు రైతులు ప్రస్తుత ఖరీఫ్ లో ఆసక్తి చూపుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో మిర్చికి ఆశించిన స్థాయిలో మద్దతు ధర లభించే అవకాశం ఉంటుందని భావనతో రైతులు పత్తికి బదులు మిర్చిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం ఉన్న రైతులు మిర్చి సాగు ద్వారా అధిక లాభాలు సాధించవచ్చునని ఆలోచనలతో గద్వాల, అలంపూర్ ఏరియాలో బోర్లు, బావులు ఉన్న భూములలో ఇటీవల కురిసిన వర్షాలకు మిర్చినారు నాటారు.

Also read: నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×