// // Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన -->
E-Paper
Advertisement

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన
Advertisement

Janagam District: పురిటి నొప్పుల‌తో బాధ ప‌డుతున్న ఓ గ‌ర్భిణికి 108 వాహానం ఆల‌స్యం అవుతుండ‌గా, ప్ర‌స‌వం కోసం ఆటోలో త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే పురిటి నొప్పులు అధికం కావ‌డంతో ఆశా వ‌ర్క‌ర్లు ప్ర‌స‌వం చేసి మ‌గ‌బిడ్డ ప్రాణాలు నిలిపారు. మ‌గ‌బిడ్డ‌కు పురుడు పోసి ఆశా వ‌ర్క‌ర్లు ఆ బాబు పాలిట దైవాలుగా నిలిచారు. ఈ సంఘ‌ట‌న శ‌నివారం సాయంత్రం జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న‌పురం నెల్లుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనగామ జిల్లా లింగాల ఘ‌న‌పురం మండ‌ల కేంద్రానికి చెందిన‌ ఏదునూరి క‌న‌క‌ల‌క్ష్మీ(22)కి ఒక్కసారిగా పురిటి నొప్పులు వ‌చ్చాయి. దీంతో క‌న‌క‌ల‌క్ష్మీ భ‌ర్త ఉపేంద‌ర్ 108కు ఫోన్ చేయ‌గా ఆల‌స్యం అవుతుంది అని ఫోన్ లో సమాధానం ఇచ్చారు. దీంతో క‌న‌క‌ల‌క్ష్మీ బంధువైన శ్రీ‌శైలంకు త‌న ఆటోలో జ‌న‌గామ ఎంసీహెచ్‌కు త‌ర‌లిస్తుండ‌గా ఆటోలోనే పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. శ్రీ‌శైలంకు తెలిసిన నెల్లుట్ల‌కు చెందిన ఆశ వ‌ర్క‌ర్ల‌కు ఫోన్‌లో స‌మాచారం అందజేశారు.

Advertisement

ALSO READ: Indian Railways: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే ఎక్స్ లెంట్ లైఫ్, భారీ వేతనం

విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆశా వ‌ర్క‌ర్లు చీటూరి అరుణ‌, కోండ్ర పుష్ప‌, జెగ్గం ఉమ‌లు నెల్లుట్ల రోడ్డుపైనే ఆటోను ఆపి గ‌ర్భిణికి ప్ర‌స‌వ చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో ఏదునూరి కనక లక్ష్మీకి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. తల్లి, బాబు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంత‌లోనే 108కు అక్క‌డి చేరుకోవ‌డంతో చికిత్స కోసం జ‌న‌గామ ఎంసీహెచ్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా ఆశా వ‌ర్క‌ర్లకు క‌న‌క‌ల‌క్ష్మీ కుటుంబ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప‌లువురు ఆశా వర్కర్లను అభినందించారు.

Advertisement

ALSO READ: Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

ఈ సంద‌ర్భంగా ఆశా వ‌ర్క‌ర్ అరుణ మాట్లాడుతూ.. మేము విధులు ముగించుకుని ఇంటికి పోతుండ‌గా, ఆటో డ్రైవ‌ర్ ఫోన్ చేసి స‌మాచారం ఇవ్వ‌డంతో రోడ్డు మీద‌నే ప్రసవం చేయాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. ఆటోలోనే కాన్పు చేసిన్ప‌టికి బాబు ఆరోగ్యంగా ఉన్నాడ‌ని తెలిపారు. కాన్పు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని, ప్ర‌భుత్వం ఇచ్చిన శిక్ష‌ణ ఇలా ఉప‌యోగ‌ప‌డింద‌ని వారు వివరించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×