E-Paper
Advertisement

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఆర్ అండ్ బీ కార్యాలయంపై అధికారుల కొరడా..!

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఆర్ అండ్ బీ కార్యాలయంపై అధికారుల కొరడా..!
Advertisement

Swetcha Effect: హుజూరాబాద్‌లోని ఆర్ అండ్ బీ (రోడ్లు, భవనాల శాఖ) సబ్ డివిజన్ కార్యాలయంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై ‘స్వేచ్ఛ’ పత్రికలో ప్రచురితమైన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. పది నెలలుగా సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, విధులకు గైర్హాజరవుతున్న వైనంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

విధులకు గైర్హాజరైన 11 మందికి మెమోలు

కార్యాలయంలో డిప్యూటీ ఈఈ, ఏఈలు, అసిస్టెంట్లు కలిపి మొత్తం 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, బుధవారం నాడు ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గానూ వారందరికీ వివరణ కోరుతూ తక్షణమే మెమోలు జారీ చేశారు.

Advertisement

Also Read: Pakistan vs Sri Lanka: అమ్ముడుపోయిన శ్రీలంక‌..పాకిస్తాన్ చేతిలో ఓడిపోయేందుకు డీలింగ్‌..!ఇక ఇండియాలో నో ఫైన‌ల్స్

సాంకేతికత అమలుపై ఆదేశాలు

బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారని గుర్తించిన అధికారులు, వెంటనే కార్యాలయంలో డిజిటల్ హాజరు విధానాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. పర్యవేక్షణ లోపం లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Advertisement

దూర ప్రాంతాల నుండి వచ్చి పనులు కాక ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల పక్షాన నిలబడి వార్తను ప్రచురించిన ‘స్వేచ్ఛ’ పత్రికపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారుల స్పందనతో ఇకనైనా కార్యాలయం సక్రమంగా నడుస్తుందని ఆశిస్తున్నారు.

Also Read: Cyber Crime: ప్రేమ పేరుతో వల.. క్రిప్టో పేరుతో విలన్.. అంతర్జాతీయ సైబర్ నేరస్థుడు అరెస్ట్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×