E-Paper
Advertisement

Rare Bird: హుజూరాబాద్‌లో వింత పక్షి కలకలం

Rare Bird: హుజూరాబాద్‌లో వింత పక్షి కలకలం
Advertisement

Rare Bird: స్వేచ్ఛ బ్యూరో: పట్టణ శివారులోని కేసీ క్యాంపు ప్రాంతంలో శుక్రవారం ఓ వింత పక్షి ప్రత్యక్షమై స్థానికులను విస్మయానికి గురిచేసింది. మనిషి ముఖ వర్చస్సును పోలి ఉన్న ఈ పక్షిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కాకతీయ కాలువ వంతెన సమీపంలోని ఓ తోటలో ఈ పక్షి కనిపించింది. కోతులు దీనిని తరమడంతో ప్రాణభయంతో పారిపోతూ పొదల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది.

Also Read: Railway Dispute: పునర్వి విభజన చట్టానికి తూట్లు.. ఓరుగల్లులో రైల్వే ఖజానాకు భారీగా గండి..!

అధికారులకు సమాచారం

Advertisement

స్థానికుడు భాస్కర్ సమాచారంతో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన పక్షిని సురక్షితంగా బయటకు తీసి, పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు పక్షిని స్వాధీనం చేసుకుని మెరుగైన సంరక్షణ కోసం కరీంనగర్‌లోని డీర్ పార్కుకు తరలించారు. ఆపదలో ఉన్న మూగజీవిని కాపాడిన వేణుగోపాల్‌ను స్థానికులు అభినందించారు.

Also Read: Tourism Scam: మంత్రి జూపల్లి కష్టమంతా వృదా అయినట్టేనా.. టూరిజంలో నయా దందా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×