E-Paper
Advertisement

Hyderabad : కారులో విదేశీ యువతిపై అత్యాచారం.. హైదరాబాద్‌లో దారుణం

Hyderabad : కారులో విదేశీ యువతిపై అత్యాచారం.. హైదరాబాద్‌లో దారుణం
Advertisement

Hyderabad : హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది. పాతబస్తీలో దారుణం జరిగింది. విదేశీ యువతిని కారు డ్రైవర్ రేప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితుడి కోసం స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

విదేశీ యువతి హైదరాబాద్ ఎందుకు వచ్చిందంటే..

Advertisement

నగరానికి చెందిన ఓ యువకుడు జర్మనీలో చదువుకున్నాడు. అక్కడ ఓ జర్మనీ యువతితో స్నేహం చేశాడు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఆ యువకుడు ఇక్కడే ఉన్నాడు. దోస్త్‌ను కలిసేందుకు వారం క్రితం జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చింది ఆ యువతి. ఫ్రెండ్స్ ఇద్దరూ సిటీలోని టూరిస్టు ప్లేస్‌లు చుట్టేశారు. వెకేషన్ ట్రిప్ ముగియడంతో తిరిగి జర్మనీ వెళ్లిపోయేందుకు రెడీ అయింది ఆమె. సోమవారం నైట్ రిటర్న్ ఫ్లైట్.

జర్మన్ యువతి సింగిల్‌గా ఎందుకు వెళ్లినట్టు?

Advertisement

క్యాబ్ బుక్ చేసుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది ఆ జర్మన్ యువతి. ఇక్కడే చిన్న మిస్టేక్ జరిగింది. సెండాఫ్ ఇవ్వడానికి ఆమె ఫ్రెండ్ కూడా తోడుగా వెళ్లాల్సింది. కానీ, ఆ యువతి క్యాబ్ మాట్లాడుకుని సింగిల్‌గా విమానాశ్రయం వెళ్తోంది. ఆ టైమ్‌లో ఆమెకు తెలీలేదు.. ఆ జర్నీ ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తుందో.

కారు డ్రైవర్ క్రూరత్వం

కారులో కూర్చున్న విదేశీ యువతిపై డ్రైవర్ కన్నేశాడు. మామిడిపల్లి ప్రాంతంలో రూట్ డైవర్ట్ చేసి.. నిర్మానుష ప్రాంతంలో కారు డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. జర్మన్ యువతి ఎంత గట్టిగా వ్యతిరేకించినా.. డ్రైవర్ పశుత్వం నుంచి బయటపడలేకపోయింది. తేరుకున్నాక డయల్ 100కి ఫోన్ చేసింది. జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పింది.

హైదరాబాద్ పోలీసులా మజాకా..

హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించారు. బాధిత యువతి ఫారిన్ కావడంతో కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. తక్షణం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. యువతి ఇచ్చిన సమాచారంతో కారు నెంబర్ గుర్తించారు. సమీప ప్రాంతాల సీసీకెమెరాలతో కారు వెళ్లే రూట్ పసిగట్టారు. ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలించి.. నిందితుడిని పట్టుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసు చాలా సున్నితంగా మారింది. గోప్యత పాటిస్తూ పక్కాగా ఎంక్వైరీ చేస్తున్నారు.

మారరా.. మీరిక మారరా?

హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. మల్టీ నేషనల్ కంపెనీలకు కేరాఫ్. ఐటీ సెక్టార్‌లో రాత్రీపగలు అనే తేడా లేకుండా యువత స్వేచ్ఛగా తిరుగుతుంటారు. మన సిటీ చాలా సేఫ్. ఈ నమ్మకంతోనే నగరానికి భారీ పెట్టుబడులు, దేశవిదేశాల నుంచి ఉద్యోగులు, పర్యాటకులు వస్తుంటారు. కానీ.. అప్పుడప్పుడూ జరిగే ఇలాంటి చెండాలపు పనుల వల్ల హైదరాబాద్ ప్రతిష్టకు మరకలు అంటుతున్నాయి. ఏ రాత్రి వేళలో.. ఏ మూలనో జరిగే అమానుషాలు, అఘాయిత్యాలు మనకు తలవొంపులు తీసుకొస్తున్నాయి. నగరమంతా సీసీకెమెరాల వ్యవస్థ ఉంది. సిటీ పోలీసులు 24 బై 7 అలర్ట్‌గా ఉంటారు. జర్మనీ యువతిపై రేప్ కోసులోనూ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని గంటల గ్యాప్‌లోనే పట్టుకున్నారు. ఇలాంటి కేసుల్లో ఎవరూ తప్పించుకోలేరు.. కఠిన శిక్షలు తప్పవు అని తెలిసినా.. కొందరు కామాంధులు ఇలా రెచ్చిపోవడం దారుణం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×