E-Paper
Advertisement

తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
Advertisement

Railway Project: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు ఇది నిజంగా తీపి కబురు. మణుగూరు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో రైలు ప్రయాణ కల త్వరలో నెరవేర బోతోంది. రామగుండం – మణుగూరు రైల్వే లైన్ మార్గం సుగమం అయింది. ఎన్నో ఏళ్ల ప్రయత్నాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్ర ప్రాయంగా ఆమోదం లభించింది. “రామగుండం-మణుగూరు రైల్వే మార్గం ఆమోదం శుభ పరిణామం. మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు దీనివల్ల ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయంటున్నారు.

ప్రాజెక్ట్ డిటైల్స్..

రూ.4వేల కోట్లు అంచనా వ్యయం కాగల ఈ ప్రాజెక్ట్ కు రూ.2911.84 కోట్లు 2026-27 బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. దీంతో మణుగూరు రైల్వే మార్గం కీలక కోల్ కారిడార్ గా మారనుంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ బొగ్గు రవాణా దూరాన్ని తగ్గించనుంది. అట్లే రవాణా వ్యయం తగ్గుతుంది. భద్రాచలం నుండి రామగుండం 286 కి.మీ బదులు 90 కి.మీ దూరం తగ్గుతుంది.

ఇది కొత్త బ్రాడ్ గేజ్..

Advertisement

దీని మార్గం, పొడవు 207.80 కిలోమీటర్లు. ఇది రామవరం నుండి మొదలై మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపురం, గోపాలరావుపేట, రామానుజవరం మీదుగా మణుగూరు వరకు ఉంటుంది. 8-10 ఏళ్లలో ఖచ్చితంగా పని పూర్తవాలని నిర్మాణ కాలపరిమితి పెట్టారు. రామగుండం-మణుగూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Also read: ఆ 6 నెలలు నా కలల్ని నాశనం చేశాయి – ఆర్. మాధవన్

కీలక లింక్..

Advertisement

గిరిజన ప్రాంతాలకు అనుసంధానం ద్వారా మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్, నాగ్‌పూర్-విజయవాడ సెక్షన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా నిలవనుంది. మరియు భద్రాచలం-కొవ్వూరు రైల్వే మార్గం పూర్తయితే విశాఖపట్నంతో కలుస్తుంది.

ముఖ్య ఉద్దేశం

బొగ్గును రవాణా సులభతరం చేయడం, ప్రజల ప్రయాణం సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగ పడనుంది.

భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం

పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మే నెలలోనే భూసేకరణ ప్రకటన విడుదలైంది. కొన్ని జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్వేతో పాటు భూ పరీక్షలు పూర్తయ్యాయి.

Also read: ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×