E-Paper
Advertisement

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు
Advertisement

Telangana Jagruthi: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరో నేత.. తెలంగాణ జాగృతిలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేశ్ నాయక్, సోమవారం తెలంగాణ జాగృతిలో చేరికయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.

కవిత ఆహ్వానం
తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన రాజేశ్ నాయక్ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని.. ఉద్యమకారులమంతా కలిసి సామాజిక తెలంగాణ సాధనకు పాటుపడదామని కవిత పిలుపునిచ్చారు.

Advertisement

రాజేశ్ నాయక్ స్పందన
రాజేశ్ నాయక్ స్పందిస్తూ.. కవిత అక్క పిలపు మేరకు తెలంగాణ జాగృతిలో చేరానని చెప్పారు.. తెలంగాణ ఉద్యమకారుల పునరేకీకరణ జరగాలని అక్క పిలుపునివ్వడంతో జాగృతిలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆమె ఇచ్చిన పిలుపు ఎంతో ప్రేరణ కలిగించింది. ఉద్యమం నడిపిన మన అందరం ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం మళ్లీ కలవాలి అని అన్నారు.

బీఆర్ఎస్‌పై అసంతృప్తి
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లకు గురై ఆస్తులు అమ్ముకొని ఉద్యమంలో పని చేశానని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్నారు.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలను ప్రోత్సహిస్తుండటంతోనే బీఆర్ఎస్ ను వీడి తెలంగాణ జాగృతిలో చేరుతున్నానని చెప్పారు.

Advertisement

కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు ఇస్మాయిల్, సంపత్ గౌడ్, కోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరంతా రాజేశ్ నాయక్ చేరికను స్వాగతిస్తూ, ఇది జాగృతి బలోపేతానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

సామాజిక తెలంగాణ కోసం పునఃప్రయాణం
జాగృతిలో రాజేశ్ నాయక్ చేరికతో.. తెలంగాణ ఉద్యమకారుల్లో కొత్త చైతన్యం నెలకొంది. ఉద్యమ దశలో కలిసిన స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. ఉద్యమం కేవలం ఒక రాజకీయ లక్ష్యం కాదు, ఇది తెలంగాణ సమాజ మార్పు కోసం పిలుపు అని కవిత వ్యాఖ్యానించారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×