E-Paper
Advertisement

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, హిస్టోరీకల్ డే అంటూ కేటీఆర్ ట్వీట్

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, హిస్టోరీకల్ డే అంటూ కేటీఆర్ ట్వీట్
Advertisement

Hyderabad: దేశీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్. ఈ సెగ ఇప్పుడు తెలంగాణాను తాకింది. అంతేకాదు తెలంగాణ రాజకీయాల్లో తుపాను రేపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్- పెట్టుబడులకు సంబంధించి ఆ కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్ని అస్త్రంగా చేసుకుని కేటీఆర్‌పై అధికార-విపక్షాలు విమర్శల దాడి తీవ్రతరం చేశాయి.

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు

Advertisement

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్ వ్యవహారం సెగ తెలంగాణకు తాకింది. నాలుగేళ్ల కింద అంటే సరిగ్గా 2022 జూన్‌లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీతో పెట్టుబడులకు సంబంధించి ఓ ఒప్పందం చేసుకున్నారు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇది కూడా ఒకటి.

దేశంలో అత్యంత అధునాతనమైన అమోలెడ్ డిస్‌ప్లేలను తయారు చేసేందుకు తెలంగాణలో 24 వేల కోట్ల పెట్టుబడి పెడతామని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు ఆ కంపెనీ ఛైర్మన్ రాజేష్ మెహతా. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ‘హిస్టోరీకల్ డే ఫర్ తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు సదరు మంత్రి.

Advertisement

ఆనాడు హిస్టోరీకల్ డే అంటూ కేటీఆర్ ట్వీట్.. ఎదురుదాడి మొదలుపెట్టిన పార్టీలు

ఇప్పుడు ఈ ట్వీట్‌ని తెరపైకి తీసుకొచ్చిన అధికార-విపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు తీవ్రతరం చేశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ తెలంగాణకు తెచ్చిన ఘనమైన కంపెనీ ఇదేనా అంటూ విమర్శలు మొదలు పెట్టాయి. ఈ స్కామ్‌లో మీ.. ఎంత? అంటూ బీఆర్ఎస్ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.

తప్పుడు రికార్డులున్న కంపెనీని వెనకేసుకొచ్చిన కేటీఆర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీశారంటూ రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్ వెలుగులోకి రాగానే బీఆర్ఎస్ లో చిన్నపాటి కుదుపు మొదలైంది.

ALSO READ: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

దీనిపై బీఆర్ఎస్ సోషల్ వారియర్స్ కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆ కంపెనీ స్కామ్‌కు మాకు సంబంధం ఏంటని ఎదురుదాడి మొదలుపెట్టారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×