E-Paper
Advertisement

Raja Singh : ఆ పార్టీల్లో చేరను.. రాజాసింగ్ రెబెల్..

Raja Singh : ఆ పార్టీల్లో చేరను.. రాజాసింగ్ రెబెల్..
Advertisement

Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని స్పష్టం చేశారు. బీజేపీ టిక్కెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని తేల్చిచెప్పారు.

ఇతర పార్టీల్లో తాను చేరే ప్రసక్తి లేదని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరేదిలేదన్నారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లో చేరనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎంపైనా తీవ్ర విమర్శలు చేశారు. గోషామహల్‌ బీఆర్ఎస్ టిక్కెట్ మజ్లిస్‌ చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్‌ నిర్ణయం కోసమే గోషామహల్‌ స్థానాన్ని కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో దారుసలామ్ లో నిర్ణయిస్తారని ఆరోపించారు.

Advertisement

బీజేపీ అధిష్ఠానం తనపై సానుకూలంగా ఉందని రాజాసింగ్ తెలిపారు. సరైన సమయంలో తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇండిపెండెంట్‌గాని, ఇతర పార్టీల నుంచి కానీ పోటీ చేయనని తేల్చిచెప్పేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×