E-Paper
Advertisement

Telugu States Weather Updates: నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షం: వాతావరణ శాఖ!

Telugu States Weather Updates: నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షం: వాతావరణ శాఖ!
Advertisement

Rain Updates in Andhra Pradesh and Telangana State: భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఓ పక్క, మరో పక్క రాత్రి సమయంలో ఉక్కపోత.. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఎండల వల్ల కనీసం ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టలేని పరిస్థితి ఉందంటూ ప్రజలు పేర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాష్ట్రంలో భారీగా వర్షం కురిసింది.

ఈదురుగాలలతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్లా ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. అదేవిధంగా ట్రాన్స్ ఫార్మార్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి. అంతేకాదు.. పలు చోట్ల వడగండ్ల వర్షం కురవడంతో రైతులు భారీగా పంట నష్టపోయారు. ధ్యాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరికొన్ని చోట్లా వేరువేరు ప్రమాదాల వల్ల పలువురు మృతిచెందారు.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా రోడ్లు వరద నీటితో నిండిపోయి కనిపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. గోడ కూలి పలువురు మృతిచెందారు. అయితే, వర్షాలతో ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ, భారీ వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా బుధవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే.

Also Read: తీవ్ర నష్టం.. తీరని విషాదాన్ని మిగిల్చిన భారీ వర్షం

Advertisement

కాగా, తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షం కురిసే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. మరికొన్ని చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఇటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇటు సంబంధిత అధికారులు, అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×