E-Paper
Advertisement

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..
Advertisement

Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్టేషన్ లో రైలు ఆగుతున్న క్రమంలో పట్టాలు తప్పగా.. ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఇంజిన్ బలంగా ఢీ కొట్టడంతో రైలు కుదుపులకు గురైంది. రైలులో మూడు బోగీలు పక్కకు ఒరగడంతో.. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

రైలు ప్రమాదంపై అధికారులు అలర్టయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×