E-Paper
Advertisement

Raids In Rice Mills : కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం దుర్వినియోగం .. రైస్‌ మిల్లుల్లో రైడ్స్..

Raids In Rice Mills : కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం దుర్వినియోగం .. రైస్‌ మిల్లుల్లో రైడ్స్..
Advertisement
Today news in telangana

Raids In Rice Mills(Today news in telangana):

నిజామాబాద్‌ జిల్లాలో రైస్‌ మిల్లులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తనిఖీలకు ఆదేశించింది. దీంతో జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 మిల్లుల యజమానులు ధాన్యం అమ్మేసినట్టు గుర్తించారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 కోట్ల విలువైన 2.44 లక్షల క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు అధికారులు గుర్తించారు. ఖరీప్ లో 4 శాతం, రబీలో 60 శాతానికి పైగా కస్టమ్ మిల్లింగ్ ధాన్యం బకాయిలు పడ్డ మిల్లర్‌ యజమానులపై చర్యలకు సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలోనే 9 మిల్లుల యాజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. 9 రైస్ మిల్లుల యజమానుల ఆస్తుల జప్తునకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో నోటీసులు ఇచ్చింది.

local news in telangana
Advertisement

రైస్‌ మిల్లుల్లో ధాన్యం కుంభకోణం జరిగిందని రైత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు .ఇదే విషయంపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

nizamabad news today

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×