E-Paper
Advertisement

Rahul and Revanth Travels in City Bus: సిటీ బస్సులో రాహుల్, రేవంత్, ప్రయాణికులతో మాటా మంతీ.. ఫ్రీ బస్సుపై ఆరా..!

Rahul and Revanth Travels in City Bus: సిటీ బస్సులో రాహుల్, రేవంత్, ప్రయాణికులతో మాటా మంతీ.. ఫ్రీ బస్సుపై ఆరా..!
Advertisement

Rahul Gandhi and CM Revanth Readdy Travels in Hyderabad City Bus: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి ప్రజలతో మమేకం అవుతున్నారు. సందర్భం ఏదైనా వారితో కాసేపు మాట్లాడి, వారి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ, సరూర్‌నగర్ జన జాతర బహిరంగ సభ తర్వాత కాస్త రిలాక్స్ కోసం ప్రజల్లోకి వెళ్లిపోయారు.

గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీ బస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి కాసేపు ట్రావెల్ చేశారు. రష్‌గా ఉన్న బస్సులో ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై నేరుగా ప్రజల నుంచి వివరాలు కూడా తీసుకున్నారు. దాదాపు గంటకు పైగానే ట్రావెల్ చేశారు. ఈ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించారు.

Advertisement

తెలంగాణ ఆర్టీసీలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళల నుంచి సమాచారం రాబట్టారు రాహుల్‌గాంధీ. ఇప్పటివరకు అమలు చేసిన పథకాల తీరు ఎలా ఉన్నాయని అడిగారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ఆరా తీశారు. యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించారు అగ్రనేత. ఈ సందర్భంగా ప్రయాణికులు రాహుల్, రేవంత్ కలిసి ఫోటోలు దిగారు.

గతంలో భారత్ న్యాయ్ యాత్ర వేళ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చారు రాహుల్‌‌గాంధీ. రాత్రి వేళ ఓ రెస్టారెంట్‌కి వెళ్లి సందర్శకులతో ముచ్చటించారు. రాహుల్‌గాంధీని చూడగానే అక్కడికి వచ్చిన ప్రజలు చుట్టుముట్టారు. ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే పథకాల గురించి కూడా వివరించారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలతో రాహుల్ భేటీ అయిన సందర్భాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×