// // Rahul Gandhi: బీఆర్ఎస్‌కి ఎంత దూరమంటే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rahul Gandhi: బీఆర్ఎస్‌కి ఎంత దూరమంటే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాహుల్‌గాంధీ..

Rahul Gandhi: బీఆర్ఎస్‌కి ఎంత దూరమంటే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాహుల్‌గాంధీ..
Advertisement
rahul gandhi

Rahul Gandhi speech today(Khammam congress meeting): బీజీపీ కన్ప్యూజన్ పాలిటిక్స్ చేస్తోంది. బీఆర్ఎస్.. కాంగ్రెస్‌కు బీ టీమ్ అంటోంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఇచ్చేది కేసీఆరేనని ఒకరు.. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చేది కూడా గులాబీ బాసేనని ఇంకొకరు.. ఇలా మైండ్ గేమ్ ఆడుతోంది. ఇలాంటి ఆరోపణలకు, అనుమానాలకు ఖమ్మం కాంగ్రెస్ జనగర్జనతో చెక్ పెట్టారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు రాహుల్. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను ఎంతగా ధ్వేషిస్తోందో ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశాన్ని అందుకు ఉదాహరణగా చూపించారు.

Advertisement

ఢిల్లీ మీటింగ్‌కు బీఆర్ఎస్‌ను కూడా పిలవాలని కొన్నివిపక్ష పార్టీలు ప్రతిపాదన తీసుకొచ్చాయని చెప్పారు. అయితే, బీఆర్ఎస్ వస్తే ఆ మీటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ హాజరు కాబోదని తేల్చిచెప్పినట్టు రాహుల్ తెలిపారు. బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ అని, తాము ఆ పార్టీతో కలిసి కూర్చోమని.. ఆయా పార్టీలకు స్పష్టం చేసినట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించబోతున్నట్టు సవాల్ విసిరారు.

ఇక, గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా.. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపిచ్చారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్ ఆలోచనా విధానాలు నచ్చిన వారందరికీ.. పార్టీ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. బీఆర్ఎస్‌కు మాత్రం శాశ్వతంగా డోర్లు మూసే ఉంటాయని చెప్పారు. కేసీఆర్ పార్టీతో ఏ రకంగానూ సంబంధాలు ఉండవని ఖమ్మం సభ సాక్షిగా తేల్చిచెప్పారు రాహుల్.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×