E-Paper
Advertisement

Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్
Advertisement

Bhuvanagiri News: తెలుగు రాష్ట్రాల్లో రోజుకో ప్రాంతంలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. ఒకప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూసేవి. ఇప్పుడు పాఠశాలలకు పాకింది. తాజాగా అలాంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాలలో బయటపడింది.

పాఠశాలలో ర్యాగింగ్ దుమారం

Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్‌ దుమారం రేపింది. అర్ధరాత్రి వేళ అరడజను పదో తరగతి విద్యార్థులపై దాదాపు 20 మంది ఇంటర్‌ విద్యార్థులు ఒక్కసారిగా దాడి చేశారు. పదో తరగతి విద్యార్థులు ఎదురించే క్రమంలో పలువురు గాయపడ్డారు. అడ్డొచ్చినవారిని కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.

దాడి చేసినవారంతా ఇంటర్ సెకండియర్ స్టూడెంట్స్ అని తెలుస్తోంది. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్లతో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి

పాఠశాల ప్రిన్సిపల్‌, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ర్యాగింగ్ విషయం బయటికి తెలియగానే ఐదుగురు విద్యార్థులను హాస్టల్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పాఠశాలల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×