E-Paper
Advertisement

కేటీఆర్, కవితలపై రఘునందన్ రావు ఫైర్.. 2007లో ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నల వర్షం!

కేటీఆర్, కవితలపై రఘునందన్ రావు ఫైర్.. 2007లో ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నల వర్షం!
Advertisement

Raghunandan Rao: బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న కేటీఆర్, కవితలకు మెదక్ రఘునందన్ రావు చురకలు అంటించారు. బీజేపీ ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్డేవి కాలేజీలో జరుగుతున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. బీజేపీని పదే పదే టార్గెట్ చేస్తున్న కేటీఆర్.. 2007లో ఎక్కడ ఉన్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేతి కవిత.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అటు వడ్ల కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడటం సరికాదని రఘునందన్ రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన లేకుండా నాయకులు మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్ర అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రతి గింజ కొనుగోలు చేస్తాం అని ఎన్నికల ముందు చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వన్ నేషన్.. వన్ రేషన్ తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో గోదాంలలో రేషన్ ను ఎలుకలు తినేవని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ పాలనలో రేషన్ దుకాణాలను డిజిటల్ చేసినట్లు గుర్తుచేశారు.

Advertisement

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆశీస్సులు మోదీకి ఉన్నాయని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక పంటలకు మద్దతు ధర పెంచింది మర్చిపోయారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. రైతు సరుకులను కేంద్రం కొనుగోలు చేస్తోందని తెలియజేశారు. ధాన్యం కొనుగోలుపై చర్చకు తాము సిద్దమని సవాలు విసిరారు.

Also Read: రేవంత్‌కు క్లోజ్‌గా ఉండటంతో.. నా ఫోనూ ట్యాప్ చేశారు.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Advertisement

నరేంద్ర మోదీ మరోమారు దేశానికి ప్రధాని అవుతారని ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. 2047 నాటికి మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ, తెలంగాణ అంటూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు రఘునందన్ రావు చురకలు అంటించారు. వైసీపీ మహిళా నేత రోజా ఇంట్లో విందు భోజనం చేస్తూ.. రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మరోవైపు ప్రజాస్వామ్యంలో ఎవరైన ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×