E-Paper
Advertisement

Raghunandan : మాలలో ఉండి అబద్దాలా..! రోహిత్ రెడ్డికి రఘునందన్‌ కౌంటర్..

Raghunandan : మాలలో ఉండి అబద్దాలా..! రోహిత్ రెడ్డికి రఘునందన్‌ కౌంటర్..
Advertisement

Raghunandan : తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీల నేతలు సవాల్ ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అయ్యప్ప మాలలో ఉండి అలా మాట్లాడటం సరికాదని సూచించారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.

రోహిత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దొర అని తిట్టారని రఘునందన్ గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు అదే దొర వద్ద పనిచేస్తున్నారని చురకలు అంటించారు. తాను డబ్బులు వసూలు చేశానన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. డబ్బులు వసూలు చేస్తే నిరూపించాలని రఘునందన్ సవాల్ విసిరారు.

Advertisement

జర్నలిస్టు ఉద్యోగం నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ. 10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్‌చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రఘునందనరావు స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ఎదురు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో రోహిత్ రెడ్డి పాల్గొనలేదని అన్నారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. తన ఆస్తుల వివరాలు వెల్లడించాడనికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు బహిర్గతం చేయడానికి సిద్ధమేనా అని రఘునందన్ సవాల్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×