E-Paper
Advertisement

Jagitial News: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?

Jagitial News: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?
Advertisement

Jagitial News:  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట్ గ్రామంలో రేబీస్ వ్యాధి కలకలం రేపింది. ఒక గేదె మృతి చెందడం, ఆ గేదె పాలు తాగిన సుమారు 30 మంది గ్రామస్థులు ఆందోళనతో టీకాలు వేయించుకోవడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కొద్దిరోజుల క్రితం వేంపేట్ గ్రామానికి చెందిన ఒక పాడి రైతు గేదెను వీధి కుక్క కరిచింది. ఆ తర్వాత సదరు గేదెలో రేబీస్ లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో ఆ గేదె నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. అయితే.. గేదె అనారోగ్యానికి గురై చనిపోయే ముందు వరకు దాని పాలను ఆ రైతు కుటుంబంతో పాటు మరికొందరు గ్రామస్థులు వినియోగించారు.

Advertisement

రేబీస్ సోకిన జంతువు పాలు తాగడం వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఉందన్న భయంతో గ్రామస్థులు వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు.. సుమారు 30 మంది ముందస్తు జాగ్రత్తగా రేబీస్ నిరోధక టీకాలు (Anti-Rabies Vaccine) వేయించుకున్నారు. ప్రస్తుతానికి బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. గ్రామంలో భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు.

Also Read:పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×