E-Paper
Advertisement

Fee Reimbursement: మూసీ సుందరీకరణకు వేల కోట్లు.. పేద విద్యార్థులకు నిధులు లేవా?: ఆర్.కృష్ణయ్య ఫైర్

Fee Reimbursement: మూసీ సుందరీకరణకు వేల కోట్లు.. పేద విద్యార్థులకు నిధులు లేవా?: ఆర్.కృష్ణయ్య ఫైర్
Advertisement

Fee Reimbursement: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కొత్తపేట చౌరస్తా నుండి ఎల్బీనగర్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లు పేరుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వం ఈ బకాయిలను మొత్తం చెల్లించకుండా, మొన్నటి బడ్జెట్ విడుదలలో కేవలం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీసీ విద్యార్థులను ఘోరంగా అవమానించడమేనని, వారికి ప్రభుత్వం చేస్తున్న తీరని అన్యాయమని మండిపడ్డారు.

Advertisement

ఖజానాలో డబ్బులు లేవని సాకులు చెబుతున్న ప్రభుత్వం.. మూసీ నది సుందరీకరణకు, ఫోర్త్ సిటీ నిర్మాణానికి, స్పోర్ట్స్ కోసం వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తోందని ఆర్.కృష్ణయ్య సూటిగా ప్రశ్నించారు. “మూసీలో పోయడానికి మీ దగ్గర వేల కోట్లు ఉంటాయి.. కానీ పేద విద్యార్థుల చదువులకు, వారి భవిష్యత్తుకు మాత్రం చిల్లిగవ్వ ఉండదా?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు తాను చేసిన పోరాట ఫలితంగానే, పేద విద్యార్థుల కష్టాలను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రకటించి న్యాయం చేశారని కృష్ణయ్య గుర్తుచేశారు. కానీ నేడు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపుతున్నారని, దీనివల్ల ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో విద్యార్థులంతా ఏకమై ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బకాయిలు మొత్తం విడుదల చేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Read Also: Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎట్టకేలకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×