E-Paper
Advertisement

Publicity Stunt: రీల్స్ కోసం రైఫిల్​‌తో హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు

Publicity Stunt: రీల్స్ కోసం రైఫిల్​‌తో హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement

Publicity Stunt: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆరాటంతో యువత హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడానికి మితిమీరిన విన్యాసాలు చేస్తూ వీడియోలను రీల్స్ రూపంలో సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తారు. వీళ్లు చేసే హంగామా వల్ల ఇతరులు ఇబ్బంది పడతారనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారు. పాపులారిటీ కోసం ఇలాంటి చేష్టలు చేసే వారికి పోలీసులు సరైన గుణపాఠం చెబుతున్నారు.

ఈ నెల 26న రీల్స్ కోసం అర్ధరాత్రి ఓపెన్​ టాప్​ జీపులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను అరెస్ట్ చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు. రోడ్డు నెంబర్​.1లో కొందరు ఆకతాయిలు మితిమీరిన వేగంతో వెళ్తూ సర్వీ హోటల్​ దగ్గర గాల్లో రైఫిల్ చూపించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఇది గమనించిన కానిస్టేబుల్​ శ్రీకాంత్​ యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ALSO READ: 10th పేపర్ లీక్ కేసులో ట్విస్ట్

శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జీపు నంబర్ దొరికిందని తెలిపారు. ఆ జీపులో ఉన్నది సనత్​ నగర్‌కు చెందిన అఫీజుద్దీన్​ (21)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అఫీజుద్దీన్‌తో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీడియో గ్రాఫర్​‌గా పని చేస్తున్నానని, రీల్స్ కోసమే జీపులో వెళ్తూ రైఫిల్ చూపించానని అఫీజుద్దీన్ ఒప్పుకున్నాడని తలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా తుపాకితో పబ్లిక్‌ని భయపెట్టినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×