E-Paper
Advertisement

Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..
Advertisement

Nandakumar : ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌ ఏ-2గా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే దక్కన్‌ కిచెన్‌లో వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్‌నగర్‌లోని ఓ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజ్‌కు ఇచ్చి డబ్బులు తీసుకున్నారని నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై నందకుమార్‌పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఆయన ఇప్పటికే రిమాండ్‌ ఖైదీగా ఉన్నందున పీటీ వారెంట్‌కు అనుమతివ్వాలని బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టును కోరారు. రెండు వేర్వేరు కేసుల్లో నందకుమార్‌ నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని వారెంట్‌లో ప్రస్తావించారు. ఒక ఫిర్యాదుదారు నుంచి దాదాపు రూ.70లక్షలు, మరొకరి నుంచి రూ. 2 లక్షల వరకు తీసుకుని మోసం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. కేసు దర్యాప్తు కోసం పీటీ వారెంట్‌ జారీ చేయాలని పోలీసులు కోరారు. పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతిస్తే రిమాండ్‌లో ఉన్న నందకుమార్‌ను అరెస్టు చేస్తారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×