E-Paper
Advertisement

Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..

Praja Bhavan Car Accident Case : ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు..
Advertisement

Praja Bhavan Car Accident Case : హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా కేసు నమోదైంది. ఆయన పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్‌ కుమారుడు సాహిల్ గతేడాది డిసెంబర్ లో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కొడుకును షకీల్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కు నోటీసులు ఇచ్చారు.

సీఐను మభ్యపెట్టారన్న ఆరోపణలపై షకీల్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం ఘటన తర్వాత సాహిల్ దుబాయ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలోనే లుకౌట్‌ నోటీసులు పోలీసీలు జారీ చేశారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్.. తన కుమారుడిని దుబాయ్‌కి పిలిపించుకున్నారని వార్తలు వచ్చాయి.. తాజాగా షకీల్‌తో పాటు మరో ఇద్దరిపైనా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×