E-Paper
Advertisement

Prabhakar Rao: సిట్ విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. అరెస్ట్ తప్పదా?

Prabhakar Rao: సిట్ విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. అరెస్ట్ తప్పదా?
Advertisement

Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ చేస్తున్న సిట్‌కు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలుస్తోంది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వెనక ఉన్న అసలు సూత్రధారులెవరో చెప్పకుండా పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం. ఈనెల 17న ప్రభాకర్ రావు మళ్లీ విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. ఇప్పటికే ఈకేసులో ప్రభాకర్‌ రావును మూడు సార్లు విచారణ చేసారు సిట్ అధికారులు. నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించింది సిట్.

రేపటి నుంచి ఈకేసు బాధితుల స్టేట్‌మెంట్‌లు నమోదు చేయనున్నారు. రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, జర్నలిస్ట్‌లను పిలిచి వారి స్టేట్‌మెంట్‌లు సేకరించనుంది సిట్. త్వరలో ప్రభాకర్ రావు ఫోన్‌లను సీజ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రభాకర్‌రావును మూడు రోజులుగా దాదాపు 20 గంటల పాటు విచారణ చేసిన.. సూత్రధారుల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వరంలోని సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. నేటి నుంచి బాధితుల స్టేట్‌మెంట్ తీసుకోనుంది. బాధిత రాజకీయ నేతలు, బిజినెస్‌మెన్, జర్నలిస్టులు స్టేట్‌మెంట్‌ నమోదు చేయనున్నారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితుల స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఎన్నికల సందర్బంగా SIBకి సర్వే చేసి రిపోర్ట్ చేసిన అంశాలపై రాజకీయనేతల స్టేట్‌మెంట్‌ సమాచారం తీసుకోనున్నారు. నిన్న ప్రభాకర్‌రావును 9 గంటలు సిట్ విచారణ చేసింది. ప్రభాకర్‌రావు స్పెషల్ టార్గెట్ టీమ్ తమ సెల్ ఫోన్లు ట్యాంపింగ్ చేశారని గతంలో సిట్ ముందు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో లభించిన ఆధారాలతో బాధితుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది సిట్.

Advertisement

Also Read: నిద్రలో కనేది కల.. మేల్కొలిపేది కళ, నా ఆకాంక్ష అదే

ఫోన్ టాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ మూడుసార్లు విచారణ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన డిజిపి, IG ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ అని ప్రభాకర్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో మొదట ప్రభాకర్ రావు సహకరించకపోవడంతో ఈ కేసులో మరో కీలక నిందితుడు ప్రణీత్‌రావును సిట్ విచారణ చేసింది. ఆయన స్టేట్‌మెంట్‌ ఆధారంగా మూడోసారి సిట్ ప్రభాకర్ రావుని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు టాప్ చేసినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. మూడోసారి విచారణలో కొన్ని కీలక అంశాలపై సిట్ ఆరా తీసింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన డీజీపీ మహేందర్ రెడ్డి.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజిగా పనిచేసిన అనిల్ కుమార్ ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్‌రావు చెప్పినట్లు సమాచారం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×