E-Paper
Advertisement

Ponnam Prabhakar: కేసీఆర్ తప్పు చేయకపోతే.. నిర్దోషి అని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం సవాల్.!

Ponnam Prabhakar: కేసీఆర్ తప్పు చేయకపోతే.. నిర్దోషి అని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం సవాల్.!
Advertisement

Ponnam Prabhakar: ఫోన్ టాపింగ్ కేసులో తప్పు చేయనట్లయితే విచారణలో తెలంగాణ ప్రజల ముందు నిర్దోషిత్వాన్ని కేసీఆర్ నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabakar) అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు, కుట్ర పూరితమైన అంశాలేవి లేవన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఫోన్ టాపింగ్ కేసు సీట్ విచారణ విషయమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోరాటం అంటేనే ఆత్మగౌరవమని, సకలజనులు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకుల పైన వారి కుటుంబ సభ్యులపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అతి నీచమైన నేరంగా అభివర్ణించారు.

హింసాత్మక నిరసనలు

కేసుకు సంబంధించి విచారణలో బాగంగా పిలిస్తే దానిని రాద్దాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిగితే అంత బాధపడితే కొంత మంది జీవితాల్లో ఆర్థిక, వ్యాపార రాజకీయ, ఉద్యోగ, కుటుంబాల సీక్రెట్స్ లోకి తొంగి చూసి ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేసి సమాచారాన్ని సేకరించడం దారుణమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో కక్ష సాధింపు ధోరణి అనే రాజకీయ లబ్ధి ప్రచారాన్ని మానుకోవాలన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 1,2,3,12,13 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Also Read: Mohan Babu: ది ప్యారడైజ్ కోసం కళ్ళు చెదిరే రేంజ్ లో మోహన్ బాబు రెమ్యూనరేషన్.. అంత అవసరమా?

ప్రచార కార్యక్రమంలో..

ఈ సందర్భంగా కళాకారుల బృందం పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని 20 వార్డులకు గాను 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం లింగమూర్తి కేడీ లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, బంక చందు,వివి రమణ, అక్కు శ్రీనివాస్, అయిత శ్రీధర్, గంపల శ్రీనివాస్, ఆకుల వెంకట్, మున్సిపల్ వార్డు అభ్యర్థులు చెన్నవేని అనూష, బూరుగు లత, కొండ రజిత,అయిత హరిత, కేశవేణి రమేష్, పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: పాక్ ప్లేయర్ పై వైభ‌వ్ సూర్యవంశీ దాడి ? మ్యాచ్ మ‌ధ్యలో గొడ‌వ, వీడియో వైర‌ల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×