E-Paper
Advertisement

రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్

రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్
Advertisement

Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ బీజేపీ ఇబ్బంది పెడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ‘రైతు ఘోస – బీజేపీ భరోసా’ పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా ఆడుతుందన్నారు.

నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగిందన్నారు. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

Advertisement

కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ సాంక్షన్ చేయడంలో, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.

Also Read: ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం పూర్తి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×