E-Paper
Advertisement

Ponguleti: ఖజానాను ఖాళీ చేసి ఇచ్చారు.. అయినా 6 గ్యారంటీలు అమలు చేస్తాం..

Ponguleti: ఖజానాను ఖాళీ చేసి ఇచ్చారు.. అయినా 6 గ్యారంటీలు అమలు చేస్తాం..
Advertisement

Ponguleti: బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదలిపెట్టే పరిస్థితే లేదని రెవెన్యూ , గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసి ఇచ్చింది, అయినా మేము ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని ఎట్టి పరిస్థితిలో వదలిపెట్టే పరిస్థితే లేదన్నారు.

ఆనాటి ప్రభుత్వంలో అధికారులు చేసిన తప్పులను ఎత్తి చూపించి వేధింపులకు గురి చేసే వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులను వేధింపులకు గురి చేయమన్నారు. తమది కక్ష్య సాధింపు ప్రభుత్వం కాదన్నారు. పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం అన్నారు. అందరం కలిసి సమన్వయంతో పేదలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిపెట్టమన్నారు .

Advertisement

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి శ్వేతపత్రాలను ఈ నెల 20న ప్రజల ముందు ఉంచుతామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయని, ఈ నెల 28 నుంచి మిగతా రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలా హామీలు ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం తమది కాదని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×