E-Paper
Advertisement

Talasani vs Revanth: వాడు వీడు.. పిసుకుడు.. తలసాని వర్సెస్ రేవంత్

Talasani vs Revanth: వాడు వీడు.. పిసుకుడు.. తలసాని వర్సెస్ రేవంత్
Advertisement
talasani vs revanth reddy

Talasani vs Revanth: తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి. నేతలు మాటలు మీరుతున్నారు. హద్దులు దాటి విమర్శలకు దిగుతున్నారు. ఆ సందర్భంలో పరుషమైన వ్యాఖ్యలతో రాజకీయాలను రగిలిస్తున్నారు. తిట్లు, విమర్శలలో ఆపార్టీ ఈపార్టీ అనే తేడా లేదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు తమ నోటిదురుసు ప్రదర్శిస్తూ నిత్యం బ్రేకింగ్ న్యూస్‌లో నిలుస్తున్నారు.

లేటెస్ట్‌గా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గురించి దారుణమైన బాష వాడారు. పొట్టోడు.. వాడు వీడు.. అంటూ రెచ్చిపోయారు. రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని.. ఆయన నోటికి బట్టనే లేదంటూ మండిపడ్డారు. ఉన్నది గింత.. పిసికితే ప్రాణం పోతది.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Advertisement

తలసాని తనను అన్నేసి మాటలు అంటే.. రేవంత్‌రెడ్డి ఊరుకుంటారా? ఆయన సైతం అంతకంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చాలాకాలం దున్నపోతులను కాసి, వాటితో తిరిగి.. ఆయన కూడా దున్నపోతునే అనుకుంటున్నాడేమో అంటూ ఫైర్ అయ్యారు. పెండ పిసికిన అలవాటుతో పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడని మండపడ్డారు. మట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోని.. స్థాయి గుర్తు పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు రేవంత్‌రెడ్డి

ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని.. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరుగులు నమిలేటోడు నా గురించి మాట్లాడటం బాలేదంటూ ఎద్దేవా చేశారు. పిసకాలని మోజు ఉంటే.. ఎక్కడికి రావాలో చెప్పు.. ఎప్పుడు రావాలో చెప్పు.. పిసుకుడుపై తేల్చుకుందాం.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాను ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినని.. కేసీఆర్ కాళ్లు పిసికి చెప్పులు మోసినా.. కేటీఆర్ సంకలు నాకినా.. తలసాని నాలాగా జీవితంలో అధ్యక్షుడు కాలేడని రేవంత్‌రెడ్డి సైతం మంత్రి తలసానికి గట్టిగానే ఇచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×