E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. దేశంలో తొలి కేసుగా గుర్తింపు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. దేశంలో తొలి కేసుగా గుర్తింపు
Advertisement

Phone Tapping CasePhone Tapping Case: గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఫోను ట్యాపింగ్ కేసుపై శుక్రవారం అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. శుక్రవారం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద నమోదైన తొలి కేసుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గుర్తింపు పొందింది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.

Advertisement

ఈ కేసులో ఏ3గా ఉన్న సిటీ టాస్క్ పోర్స్ మాజీ డీఎస్సీ రాధాకిషన్ రావును శుక్రవారం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతన్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఎవరెవలు భాగస్వాములు అయ్యారనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో ఒక్కో విషయం వెల్లడిస్తున్నారు.
ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలు నేతలు, పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ప్రణీత్ రావు తెలిపారు. ఈ కేసులో తనతో పాటుగా నాటి ఇంటెలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: కేటీఆర్ చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి

దీంతో పోలీసులు ప్రభాకర్ రావును ఏ1గా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రణీత్(ఏ2), సిటీ టాస్క్ పోర్స్ మాజీ డీఎస్సీ రాధాకిషన్ రావును(ఏ3), భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును ఏ4గా, తిరుపతన్నను ఏ5గా గుర్తించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఏ3గా ఉన్న రాధాకిషన్ రావును శుక్రవారం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×