E-Paper
Advertisement

Kurumurthy Jatara: కురుమూర్తి జాతరలో పోలీసుల ఓవరాక్షన్.. చిరు వ్యాపారులను కొట్టి.. బొమ్మలను తొక్కేసి

Kurumurthy Jatara: కురుమూర్తి జాతరలో పోలీసుల ఓవరాక్షన్.. చిరు వ్యాపారులను కొట్టి.. బొమ్మలను తొక్కేసి
Advertisement

Kurumurthy Jatara: పోలీసులు అంటే సామాన్యుల‌కు ర‌క్ష‌ణగా ఉండాలి. ఏదైనా ఆప‌ద వ‌స్తే కాపాడేందుకు ముందుకు రావాలి. లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించాలి. కానీ కొన్ని సార్లు పోలీసులే రౌడీల్లా రెచ్చిపోతుంటారు. స‌మాన్యుల‌తో క‌లిసి వారికి సాయం చేయకుండా జులుం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. త‌ప్పు చేసిన వారిని వ‌దిలేసి ఏ త‌ప్పూ చేయ‌ని అమాయ‌క ప్ర‌జ‌ల‌పై త‌మ ప్ర‌తాపం చూపిస్తుంటారు. నెత్తిమీద టోపీ, చేతిలో లాటీ ఉండ‌గానే తామేదో గొప్ప‌వాళ్లం అని ఫీల్ అయిపోతుంటారు.

Also read: హైద‌రాబాద్ లో మ‌రో చెరువును కాపాడిన హైడ్రా.. నిఘా పెట్టిమ‌రీ

Advertisement

తాజాగా ఓ పోలీస్ అధికారి ఆ విధంగానే ప్ర‌వ‌ర్తించాడు. జాత‌ర‌లో బొమ్మ‌లు అమ్ముకుంటున్న చిరువ్యాపారుల‌పై అత‌డి ప్ర‌తాపాన్ని చూపించాడు. ఈ ఘ‌ట‌న మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కురుమూర్తి జాతర‌లో చోటు చేసుకుంది. జాత‌ర అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వేల సంఖ్యంలో జ‌నాలు వ‌స్తుంటారు. కొన్ని వంద‌ల దుకాణాలు పెడ‌తారు. ముఖ్యంగా జాతార‌లో అంతా చిరువ్యాపారులే క‌నిపిస్తారు.

అయితే శాంతి భ‌ద్ర‌త‌లు స‌క్ర‌మంగా చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి ఆ పనిచేయ‌కుండా చిరువ్యాపారుల‌పై రెచ్చిపోయాడు. అక్క‌డ బొమ్మ‌లు అమ్ముకునే ఓ వ్య‌క్తిని కొడుతూ అత‌డు అమ్ముకునే బొమ్మ‌ల‌ను పాడు చేశాడు. వాటిని కింద ప‌డేస్తూ తొక్కుతూ ఓవ‌ర్ యాక్ష‌న్ చేశాడు. చేతిలో క‌ర్ర‌ప‌ట్టుకుని అక్క‌డ ఉన్న చిరు వ్యాపారుల‌ను అంద‌రినీ కొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు.

Advertisement

అధికారి అలా చేస్తున్న పాపం ఏమీ చేయ‌లేక వ్యాపారులు నిస్స‌హాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పోలీస్ ఓవ‌ర్ యాక్ష‌న్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇలాంటి వారివ‌ల్ల‌నే డిపార్ట్మెంట్ అంటే గౌర‌వం పోతుంద‌ని కామెంట్లు పెడుతున్నారు. రోజు రోజుకూ మాన‌వ‌త్వం మంట క‌లుస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ పోలీస్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×