E-Paper
Advertisement

హైదరాబాద్‌కు ప్రధాని.. నగరంలో మూడు గంటలపాటు పర్యటన, చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇంటికి మోదీ!

హైదరాబాద్‌కు ప్రధాని.. నగరంలో మూడు గంటలపాటు పర్యటన, చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇంటికి మోదీ!
Advertisement

Hyderabad: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఆ తర్వాత ఆయన హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన నేపథ్యంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని హైదరాబాద్ టూర్.. భారీ బహిరంగ సభకు హాజరు

Advertisement

ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. మూడు గంటలపాటు ఆయన పర్యటన సాగనుంది. ప్రధాని మోదీ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఈ టూర్‌లో భాగంగా రూ.9,377 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పలు ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు.

సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈసారి ప్రధాని హైదరాబాద్ పర్యటన రాజకీయ పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. రెండు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

Advertisement

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ!

రాజకీయాల్లో మిత్రధర్మానికి ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటోంది. కష్ట కాలంలో ఆత్మీయంగా పలకరించే తీరు ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఇంటికి రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రధాని వెళ్లనున్నట్లు సమాచారం. అదే సమయంలో పవన్‌ ఇంటికి చిరంజీవి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కాసేపు వివిధ అంశాలపై ముచ్చటించనున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతుందని చర్చ అప్పుడే మొదలైంది.

ALSO READ: ప్రధాని మోదీకి టీఆర్ఎస్ చీఫ్ కవిత బహిరంగ లేఖ.. నాలుగు కీలక డిమాండ్లు!

నార్మల్‌గా అయితే పీఎం అధికారిక షెడ్యూల్‌లో పవన్‌ ఇంటికి వెళ్లే ప్రస్తావన లేదు. పవన్ ఇంటికి వెళ్లిన తర్వాత సీఎం చంద్రబాబు ఇంటికి మోదీ వెళ్తారని, అక్కడ కొద్దిసేపు గడుపుతారని అంటున్నారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు పాల్గొంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో ప్రధాని భేటీలు వచ్చే ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×