E-Paper
Advertisement

దక్షిణ కాశీలో మోడీ గర్జన? బండి సంజయ్ మాస్టర్ ప్లాన్.. ప్రధాని కార్యాలయానికి లేఖ!

దక్షిణ కాశీలో మోడీ గర్జన? బండి సంజయ్ మాస్టర్ ప్లాన్.. ప్రధాని కార్యాలయానికి లేఖ!
Advertisement

Modi Visit: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే, సభా వేదిక ఎక్కడ ఉండాలనే అంశంపై ప్రస్తుతం పార్టీలో అంతర్గత సమాలోచనలు సాగుతున్నాయి. ప్రధాని మోడీ సభను ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలో నిర్వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసేందుకు వేములవాడ సరైన వేదిక అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర ఇబ్బందుల వల్ల వేములవాడలో కుదరకపోతే, ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సభను నిర్వహించే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి కార్యాలయానికి బండి లేఖ

Advertisement

కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాని మోడీ సభను దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో నిర్వహించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సభ కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి బండి సంజయ్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వేములవాడలో సభ నిర్వహించిన ప్రధాని మోడీ ఉదయం సమయంలోనే భారీ జన సమీకరణను చేపట్టడంపై ప్రధాని సైతం ఆశ్చర్యపోయారు. ఈనేపథ్యంలో బండికి ఆయన కితాబిచ్చారు. ప్రధాని మోడీ వేములవాడలో సభ నిర్వహిస్తానంటే అర్ధరాత్రి 11, 12 గంటలకు అయినా సరే.. ప్రజలు మోడీ కోసం వేచి చూస్తారనే ధీమాతో ఉన్నట్లుగా సమాచారం. కుదిరతే రాత్రి సమయంలోనే సభ నిర్వహించి సక్సెస్ చేస్తానని ధీమాతో బండి సంజయ్ ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ వేములవాడలో సభకు కుదరకపోతే పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి

Advertisement

ప్రధాని మోడీ పర్యటన కేవలం రాజకీయ సభలకే పరిమితం కాకుండా, భారీ అభివృద్ధి కార్యక్రమాలకు వేదిక కానుంది. ఆధునీకరించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. దాదాపు రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా రూ.450 కోట్లతో చేపట్టనున్న ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులకు ప్రధాని భూమిపూజ చేసే అవకాశాలున్నాయి. ఇది నగర ప్రయాణికులకు ఊరటనిచ్చే ప్రధాన ప్రాజెక్టు. అలాగే తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో నిర్మించిన బీబీనగర్ ఎయిమ్స్ ను కూడా ప్రధాని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎయిమ్స్ పనులు దాదాపు 90 శాతం వరకు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని పర్యటన ఖరారైతే, అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి.

Also Read: ప్రజా భవన్ లో ‘వార్ రూమ్’.. పుష్కరాల విషయంలో రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×