E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం
Advertisement

PM Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలికారు. అధికారిక లాంఛనాలతో ప్రధానికి స్వాగత పలికిన అనంతరం.. మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీ (HICC)కి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఇటీవల నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బహిరంగ సభలో ఆయన ఇచ్చే సందేశం.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఉత్కంఠగా మారింది. ప్రధాని పర్యటన దృష్ట్యా బేగంపేట నుంచి హెచ్‌ఐసీసీ వరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Read Also: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా, ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ.. నిధులపైనే ఫోకస్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×