E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు, చివరి అంకానికి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు, చివరి అంకానికి
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం చివరి అంకానికి చేరిందా? ఈ కేసుకు వేగంగా ఫుల్ స్టాప్ పెట్టాలని సిట్ భావిస్తోందా? కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందా? ఈ వ్యవహారంపై రెండురోజులుగా సిట్ అధికారులు చర్చించారా? నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం

Advertisement

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను  విచారించనుంది సిట్. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు.  శుక్రవారం  మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో ప్రస్తావించారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫిర్యాదుపై మాజీ సీఎంని విచారణ చేయనుంది.

ఇప్పటికే హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులను సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకానికి చేరింది. ఈ కేసులో తొలుత అధికారులను విచారించింది సిట్. ఆ తర్వాత రాజకీయ నేతల వంతైంది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీని విచారించారు. కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధా కిషన్‌రావు వెల్లడించారు.

Advertisement

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. శుక్రవారం మధ్యాహ్నం విచారణ

రాధా కిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పెద్దాయన అంటూ ప్రస్తావించారు పోలీసులు. ప్రస్తుతం ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో ఉన్నారు మాజీ సీఎం.  సిట్ టీమ్ నందినగర్‌లో కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని ప్రస్తావించారు. మీరు స్టేషన్‌కు వచ్చినా సరేనని, లేదంటే మీరు చెప్పిన ప్రదేశంలో విచారిస్తామని పేర్కొన్నారు. సీఆర్ పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు.

నోటీసులు అందుకున్న తర్వాత లీగల్ టీమ్‌తో కేసీఆర్ చర్చించనున్నారు.  కేసీఆర్‌ని స్టేషన్‌లో విచారిస్తారా? లేకుంటే ఫామ్ హౌస్‌లో విచారిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ నేతలు వేసే ప్రతీ అడుగు పార్టీ మైలేజీ కోసం చూస్తుంటారు. స్టేషన్‌కి వెళ్తే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. కార్యకర్తలు భారీగా తరలిరావడం వల్ల కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ALSO READ: తెలంగాణ విద్యా ముఖ చిత్రాన్ని మారుద్దాం.. హార్వర్డ్ వేదికగా యువతకు సీఎం రేవంత్ పిలుపు

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×