E-Paper
Advertisement

Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరో మలుపు తిరుగుతోందా? మరోసారి సిట్ నోటీసులు ఇవ్వాలని భావిస్తోందా? కేవలం హైదరాబాద్‌లో కేసీఆర్‌ని విచారించాలని ఆలోచన చేస్తోందా? ఫామ్ హౌస్‌కి రావాలని కేసీఆర్ మెలిక పెట్టారా? ఈ పాయింట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు!

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం విచారణకు రాలేదని సిట్‌కు రిప్లై ఇచ్చారు మాజీ సీఎం. తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలని అందులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం సిట్ అధికారులు భేటీ అయ్యారు.

కేసీఆర్ రాసిన లేఖపై  సిట్ అధికారులు చర్చించారు. ఫామ్‌హౌస్‌కి వెళ్లి విచారించవద్దని, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విచారించాలని భావిస్తోందట సిట్. ఆయనకు మరోసారి నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.  ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ముందు విచారణకు హాజరుకావాలని నోటీసు ఇస్తారా? ఎన్నికల తర్వాత హాజరుకావాలని నోటీసు ఇస్తారా? అనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

విచారణ హైదరాబాద్‌లో, ఆ పాయింట్‌పై కోర్టుకి?

మరోవైపు కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులు బీఆర్ఎస్ లీగల్ సెల్‌ చర్చించింది. సిట్ నోటీసులపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్‌రావు స్పందించారు. సీఆర్పీసీ 160 ప్రకారం కేసీఆర్‌కు నోటీసు ఇవ్వలేదన్నారు. 65 ఏళ్లు పైబడినవారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి విచారణ చేయాలన్నారు. కేసీఆర్‌ను హైదరాబాద్ పరిధిలో విచారణ చేస్తామని సిట్ సభ్యులు భావించడం చట్ట వ్యతిరేకమన్నారు.

ఆ విధంగా ఆయనకు నోటీసులు ఇవ్వడం చట్ట ప్రకారం కుదరదన్నారు. కావాలంటే దీనిపై న్యాయస్థానానికి వెళ్తామని చెప్పకనే చెప్పారు. ఈ లెక్కన విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు ఇదొక ఎత్తుగడగా సిట్ అధికారులు వర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయ్యాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు. ఈ కేసులో విచారణ మరో అడుగు ముందుకెళ్తుందా? లేకుంటే అక్కడే ఆగిపోతుందా? అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది.

ALSO READ:  మినీ మేడారంలో కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్..  అరెస్ట్ చేసిన పోలీసులు

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×