E-Paper
Advertisement

Phone Tapping Case: ముగిసిన ప్రభాకర్ రావు కస్టడీ.. ఆ పెన్ డ్రైవ్ లోనే అసలు బాగోతం..!

Phone Tapping Case: ముగిసిన ప్రభాకర్ రావు కస్టడీ.. ఆ పెన్ డ్రైవ్ లోనే  అసలు బాగోతం..!
Advertisement

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాలు, పోలీస్ వ్యవస్థను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక దశ పూర్తైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 14 రోజుల పాటు కస్టడీ విచారణ చేపట్టగా, తాజాగా ఆ విచారణ ముగిసింది. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇంటికి పంపించారు.

రిటైర్మెంట్ తర్వాత నియామకంపై సిట్ ప్రశ్నలు

Advertisement

విచారణలో భాగంగా ప్రభాకర్ రావు రిటైర్మెంట్ తర్వాత ..మళ్లీ ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించబడిన అంశంపై సిట్ అధికారులు విస్తృతంగా ప్రశ్నించినట్లు సమాచారం. రిటైర్మెంట్ అనంతరం రెండుసార్లు పదవీ పొడిగింపు ఎలా జరిగింది? దీని వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉందా? అన్న కోణంలో సిట్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి ప్రతిస్పందనగా ప్రభాకర్ రావు, ఈ నియామకంపై మీరు నన్ను కాకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడగండి అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

సీఎం కార్యాలయానికే నేరుగా రిపోర్టింగ్?

Advertisement

ప్రభాకర్ రావు నేరుగా సీఎం కార్యాలయానికే రిపోర్ట్ చేశాడన్న ఆరోపణలపై.. కూడా సిట్ ప్రశ్నలు సంధించింది. సాధారణంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక నిర్దిష్ట ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉండగా, ఆ పరిమితులను దాటి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు పంపినట్టు వచ్చిన స్టేట్మెంట్లను సిట్ గట్టిగా పరిశీలించింది.

హరీశ్ రావుతో సంప్రదింపులపై వివరణ

విచారణలో మరో కీలక అంశంగా మంత్రి హరీశ్ రావుతో తరచూ సంప్రదింపులు జరిపిన అంశం నిలిచింది. దీనిపై సిట్ ప్రశ్నించగా, మావోయిస్టుల నుంచి ప్రాణహాని హెచ్చరికలు ఉండటంతోనే.. భద్రతాపరమైన అంశాలపై సంప్రదింపులు జరిగాయి
అని ప్రభాకర్ రావు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరణపై సిట్ పూర్తిగా సంతృప్తి చెందలేదన్న సమాచారం బయటకు వస్తోంది.

వేలాది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారా?

రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేశారా అన్న కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు చేసింది. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో వ్యాపారులు, వ్యక్తులను బెదిరించేందుకు ప్రయత్నించారా? అనే అంశంపైనా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

కుటుంబ వ్యాపారాలకు లబ్ధి అంశంపై ఆరా

ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో ప్రభాకర్ రావు కుటుంబ వ్యాపారాలకు లబ్ధి చేకూరిందా? అన్న కోణంలో కూడా సిట్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు రవీంద్ర రావును కూడా సిట్ విచారించింది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలను పరిశీలిస్తూ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

నందకుమార్ స్టేట్మెంట్.. మొయినాబాద్ కేసు లింక్?

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన నందకుమార్ స్టేట్మెంట్‌ను కూడా సిట్ నమోదు చేసింది. అలాగే, సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ ఆడియో–వీడియోలు లీక్ కావడం వెనుక కారణాలపై కూడా సిట్ విచారణ కొనసాగించింది. ఈ లీక్‌లకు ఫోన్ ట్యాపింగ్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఆధారాలు సేకరించింది.

సుప్రీంకోర్టుకు నివేదిక సిద్ధం

ఈ మొత్తం విచారణ ఆధారంగా సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించేందుకు సిట్ సిద్ధమవుతోంది. ప్రభాకర్ రావుపై కస్టడీ విచారణ ముగిసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Also Read: నేడు డిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్

సజ్జనార్‌తో సిట్ భేటీ

ఇదిలా ఉండగా, ఈరోజు సిట్ బృందం మాజీ ఐజీ సజ్జనార్‌తో మరోసారి సమావేశం కానుంది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై సజ్జనార్‌తో చర్చించనున్నట్లు సమాచారం.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×