E-Paper
Advertisement

ACB Raid: నిద్రపోయే మంచం కింద ముప్పై రెండు లక్షలా?.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..!

ACB Raid: నిద్రపోయే మంచం కింద ముప్పై రెండు లక్షలా?.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..!
Advertisement

ACB Raid: స్వేచ్చ బ్యూరొ: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకున్న అసిస్టెంట్​ ఇంజనీర్​ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న 2లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత సదరు అధికారి ఇంట్లో తనిఖీ చేయగా మంచం కింద మరో 32.32లక్షల రూపాయల నగదు దొరికింది. వివరాలు ఇలా ఉన్నాయి.

2లక్షలు డిమాండ్..

పెద్దపల్లి జిల్లా మున్సిపల్​ కార్యాలయంలో కల్లేపల్లి సతీష్​ కుమార్​ అసిస్టెంట్​ ఇంజనీర్​‌గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఓ కాంట్రాక్టర్​ తెనుగువాడ, కూనారం గ్రామాల్లోని స్మశానవాటికల అభివృద్ధి పనుల కాంట్రాక్ట్​ తీసుకున్నాడు. వాటిని పూర్తి చేశాడు. ఈ క్రమంలో తనకు రావాల్సిన 12.29లక్షల బిల్లును హైదరాబాద్ లోని తెలంగాణ అర్భన్​ ఫైనాన్స్​, ఇన్​ ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్​ మెంట్ కార్పోరేషన్​ ఆఫీస్​ కు పంపించి మంజూరు చేయించాలని అభ్యర్థించాడు. ఈ పని చేసి పెట్టేందుకు సతీష్​ కుమార్​ 2లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు.

Advertisement

Also read: POCSO Case: షాబాద్ ఘటనను మించిన ట్విస్ట్.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు!

మంచం కింద 32.32లక్షల

ఈ మేరకు సమాచారం అందటంతో ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకోవటానికి వలపన్నారు. దాని ప్రకారం మంగళవారం సతీష్ కుమార్​ తన ఇంట్లోనే కాంట్రాక్టర్​ నుంచి 2లక్షల రూపాయలు తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సతీష్​ కుమార్​ ఇంట్లో తనిఖీ చేయగా మంచం కింద మరో 32.32లక్షల నగదు దొరికింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సతీష్​ కుమార్​ ను అరెస్ట్​ చేశారు.

Advertisement

Also read: Hit Run: ఆ ఒక్క క్లూతో.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి బిగ్ షాక్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×