E-Paper
Advertisement

Patancheruvu : బిగ్‌టీవీ ఎఫెక్ట్.. చెరువు దొంగల వాహనాలు సీజ్

Patancheruvu : బిగ్‌టీవీ ఎఫెక్ట్.. చెరువు దొంగల వాహనాలు సీజ్
Advertisement

Patancheruvu : పటాన్‌ చెరులో చెరువల కబ్జా వ్యవహారంపై బిగ్ టీవీ కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. శంభుని కుంట చెరువు కబ్జాపై బిగ్ టీవీలో చెరువు దొంగల పేరుతో కథనం ప్రసారమైన వెంటనే ఇరిగేషన్ ఏఈ హడావుడిగా కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు.

తాజాగా పోలీసుశాఖ కూడా రంగంలోకి దిగింది. మట్టిని తరలించేందుకు వినియోగించిన వాహనాలను అమీన్ పూర్ పోలీసులు పట్టుకున్నారు. మిగతా వాహనాలను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న బిగ్ టీవీ రిపోర్టర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి టిప్పర్ల వీడియోలు తీస్తుండగా ఓ కానిస్టేబుల్ అడ్డుకోడానికి ప్రయత్నించారు. అనుమతి లేకుండా వీడియోలు ఎలా తీస్తారంటూ వాగ్వాదానికి దిగారు.

ఎస్ఐ‌ కిష్టారెడ్డిని అనుమతి కోరగా వీడియోలు తీస్తే మిగతా వారు అలర్ట్ అయి పరారీలో ఉంటారని చెప్పడం, మరిన్ని వాహనాలను స్వాధీనం చేసుకు‌ని వివరాలను విలేకరుల సమావేశం పెట్టి వివరిస్తామని చెప్పారు.

Advertisement

ఎన్ని వాహనాలను వివరాలు ఇంకా తెలియదని ఎస్ఐ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది . మరోవైపు వాహనాలకు సంబందించిన యజమానులు సదరు ఎస్ఐ కి ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారు. వాహనాలను రిలీజ్ చేయాలని కోరుతున్నట్టు సమాచారం.

ఏదేమైనా శంభునికుంట పూడ్చివేతలో పెద్ద తలకాయలే ఉండడం, వారికి పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. కానిస్టేబుల్ ఓవర్ యాక్టింగ్ చూస్తే సందేహాలు బలపడుతున్నాయి.

శంభుని కుంటకు అక్రమార్కుల చర నుంచి విముక్తి కలుగుతుందా.. లేక ఇది కూడా మిగిలిన చెరువుల మాదిరిగా కబ్జాల చెరలో మిగిలిపోతుందనా అనేది తేలాల్సి ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×