E-Paper
Advertisement

Panchayat Elections: ఒక్క ఓటే కదా అనుకుంటాం.. కానీ ఆ సింగిల్ ఓటే ఎంత పని చేసింది భయ్యా.. వీళ్లు ఎలా గెలిచారో చూడండి..

Panchayat Elections: ఒక్క ఓటే కదా అనుకుంటాం.. కానీ ఆ సింగిల్ ఓటే ఎంత పని చేసింది భయ్యా.. వీళ్లు ఎలా గెలిచారో చూడండి..
Advertisement

తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముఖ్యంగా రెండో విడత ఎన్నికల ఫలితాల్లో ఒక్కో ఓటు ఎంత విలువైందో.. అది అభ్యర్థుల తలరాతలను ఎలా మార్చగలదో స్పష్టమైంది. అనేక గ్రామాల్లో గెలుపోటముల మధ్య వ్యత్యాసం కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే ఉండటం విశేషం. ఈ స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకోగా.. ఓటమి పాలైన వారు ఒక్క ఓటుతో అదృష్టం చేజారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి హవా

Advertisement

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్‌ఖుర్ద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బెస్త సంతోష్ సంచలన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. చివరకు ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంతోష్‌ను చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రతి ఓటు కీలకమని ఈ ఫలితం నిరూపించింది.

నల్గొండలో హోరాహోరీ పోరు

Advertisement

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడు గ్రామ పంచాయతీలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారుడైన రమేశ్ నాయక్, కాంగ్రెస్ మద్దతుదారుడిపై విజయం సాధించారు. అయితే ఈ విజయం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఉత్కంఠగా జరిగిన కౌంటింగ్‌లో రమేశ్ నాయక్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రత్యర్థిని ఓడించి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు.

వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రామాపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవి తన ప్రత్యర్థిపై తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఓట్లు సమానంగా వస్తాయేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. చివరకు ఫలితం వెలువడేసరికి రమాదేవి ఒక్క ఓటు తేడాతో విజేతగా నిలిచారు.

ఈ పరిణామాలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ వజ్రాయుధమేనని మరోసారి చాటిచెప్పాయి. అభ్యర్థులు గెలుపు కోసం చేసిన కృషి ఒకెత్తయితే.. ఆ ఒక్క ఓటు వేసిన ఓటరు నిర్ణయం వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించింది. ఈ ఉత్కంఠభరిత ఫలితాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ: Kavitha On SPB: ఎస్పీబీ తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారట.. విగ్రహం వివాదంపై కవిత సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×