E-Paper
Advertisement

BRS : కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?

BRS : కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?
Advertisement

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం ఆ తర్వాత సారీ చెప్పడం ఆయనకు పరిపాటిగా మారిందని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ప్రజల సమస్యలు పరిష్కారించాల్సి పోయి ఆయనే కొత్త సమస్యలు సృష్టించడం ఏంటి? కేసుల్లో ఇరుక్కోవడం ఏంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఆయన అస్సలు ప్రజా ప్రతినిధిగా పనికిరారని అంటున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్నారని.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే గతంలో బీఆర్ఎస్‌లో చేరిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి పచ్చి అవకాశవాది అని.. అందుకే ఆయనకు ఎథిక్స్, మోరల్స్ వంటివి లేవని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

కాంట్రవర్సీకి కేరాఫ్..

పాడి కౌశిక్ రెడ్డి కాంట్రవర్సికీ కేరాఫ్..ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసునని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన ప్రజల అటెన్షన్ ను అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ వైపు తిప్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే సీనియర్ లీడర్లను అవమానించడం, విమర్శించడం వంటివి చేస్తున్నారని టాక్. మొన్నటివరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌తో వివాదం పెట్టుకున్నారు. ఆయన్ను మతం పేరిట దూషించి ఐపీఎస్‌ల ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం ఐపీఎస్‌ల సంఘాన్ని క్షమాపణలు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల మీద వివాదాస్పద కామెంట్స్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. దీంతో పలుమార్లు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కేసులు సైతం పెట్టిన విషయం తెలిసిందే.

అభ్యంతరకర సైగలు..

Advertisement

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయడంతో పాటు రాఘవ కన్ స్ట్రక్షన్ మీద హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో కడియం శ్రీహరి మాట్లాడేందుకు నిల్చుకున్నారు. దీంతో ఆయనను చోర్ చోర్ బీఆర్‌ఎస్ నేతలు కాసేపు ర్యాగింగ్ చేశారు. అనంతరం ఆయన ఏదో మాట్లాడుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశికరెడ్డి సభలో లేచి నిల్చున్నారు. చేతుల ద్వారా సైగలు చేస్తూ గన్‌తో కాల్చి పడేస్తాం అన్నట్టుగా సైగలు చేశారు. దీనిని సభలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు.ఆయన మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.అనంతరం సీఎం రేవంత్ కలుగజేసుకుని.. ఎథిక్ కమిటీకి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని తీసుకెళ్లాలని స్పీకర్‌ను కోరారు.

 

Advertisement

Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా
ఇదిలాఉండగా, సోమవారం ఉదయం పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారి కుటుంబానికి సైతం జారీ చేసినట్టు తెలిసింది.దీంతో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనకు నోటీసులు ఇచ్చారని, రేవంత్ సర్కారు కావాలని తనపై, తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.తన మీద కేసులు పెట్టినా, నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఫైట్ చేస్తానని.. తన కుటుంబ సభ్యులను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. పాడి కౌశిక్ స్టేట్మెంట్‌ను వీక్షించిన వారంతా.. ఆయన అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్నచందంగా వ్యవహరిస్తున్నారని నెట్టింట జోరుగా చర్చ నడుస్తున్నది. కాంట్రవర్సీ కామెంట్స్, చేష్టలు చేసేముందే ఇవన్ని గుర్తుండాలి కాదా? అని మరికొందరు నిలదీస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×