// // Cyber Operation: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! ఒక్కటే వేట! -->
E-Paper
Advertisement

Cyber Operation: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! 32 టీమ్స్.. ఒక్కటే వేట!

Cyber Operation: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! 32 టీమ్స్.. ఒక్కటే వేట!
Advertisement

Cyber Operation: హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించారు. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా.. గత పది రోజుల పాటు సాగిన ఈ మెగా ఆపరేషన్‌లో మొత్తం 16 రాష్ట్రాల్లో 32 ప్రత్యేక పోలీస్ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దేశంలోనే అతిపెద్ద సైబర్ ఆపరేషన్‌గా అభివర్ణించబడుతున్న ఈ గాలింపు చర్యల్లో మొత్తం 104 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠాలు ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో అమాయకులను నిలువునా ముంచుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి.. ప్రజలను నమ్మించి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 36 లక్షల నగదుతో పాటు 200కి పైగా మొబైల్ ఫోన్లు, 152 బ్యాంక్ పాస్ బుక్కులు, 234 డెబిట్ కార్డులు , 141 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 1,055 కేసుల్లో ఈ నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

ఈ నేరగాళ్లు ఇప్పటివరకు దాదాపు రూ. 127 కోట్ల మేర సైబర్ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం నేరగాళ్లే కాకుండా.. వారికి సహకరిస్తున్న కొంతమంది బ్యాంక్ మేనేజర్లు, అక్రమ అకౌంట్ హోల్డర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని సరిహద్దులు దాటి మోసాలకు పాల్పడుతున్న వారికి ఈ ఆపరేషన్ ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×