E-Paper
Advertisement

Basara : బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలు.. టికెట్‌ ధర ఎంతంటే?

Basara : బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలు.. టికెట్‌ ధర ఎంతంటే?
Advertisement

Basara : బాసర క్షేత్రంలో కొత్తసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌ లో అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను నిర్ణయించింది.

ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు బుక్‌ చేసుకుంటే వారికి పూజ చేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్‌ ధరలు.. విదేశీయులకు రూ.2,516, మన దేశంలో ఉన్నవారికి రూ.1,516గా నిర్ణయించారు. ప్రధానంగా ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యమవుతున్నాయి. భారీగా వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని బాసర దేవస్థాన అధికారులు నిర్ణయించారు.

Advertisement

బాసర శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్ లైన్ సేవలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈఓ విజయరామారావు చర్చించారు. ఆన్ లైన్ అక్షర అభ్యాసాల ధరలను నిర్ణయించారు. ఈ టిక్కెట్ ధరలకు అనుమతి కోసం దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. దేవాదాయశాఖ నుంచి అనుమతి రాగానే ఆన్‌లైన్ లో అక్షరాభ్యాసాలు, సరస్వతీపూజ, మూలానక్షత్రం, వేద ఆశీర్వచనం పూజలను చేయడానికి ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకుతగిన విధంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×