E-Paper
Advertisement

ఎన్‌టీపీసీలో 114 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

ఎన్‌టీపీసీలో 114 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Advertisement

NTPC Green Energy recruitment 2026: మహారత్న కంపెనీ అయిన ఎన్‌టీపీసీ (NTPC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 114 అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. జులై 11 నుంచి ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి కేటగిరీల వారీగా చూస్తే..

Advertisement

అసిస్టెంట్ ఇంజినీర్ (AE – E0 గ్రేడ్): 100 పోస్టులు (ఓపెన్ కేటగిరీ-41, ఓబీసీ-27, ఎస్సీ-15, ఈడబ్ల్యూఎస్-10, ఎస్టీ-07)

డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM – E6 గ్రేడ్): 14 పోస్టులు,(ఓపెన్ కేటగిరీ-08, ఓబీసీ-03, ఎస్సీ-01, ఎస్టీ-01, ఈడబ్ల్యూఎస్-01)

అర్హతలు:

Advertisement

అసిస్టెంట్ ఇంజినీర్: సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థుల గరిష్ట వయస్సు 44 ఏళ్లు మించకూడదు.

డిప్యూటీ జనరల్ మేనేజర్: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ (B.E/B.Tech) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో.. ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ట వయస్సు 40 ఏళ్లు మించకూడదు.

జీతం:
అసిస్టెంట్ ఇంజినీర్: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది.

డిప్యూటీ జనరల్ మేనేజర్: నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకు భారీ జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లను మొదట స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత పోస్టులను బట్టి రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జులై 11
చివరి తేదీ: జులై 31

అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×