E-Paper
Advertisement

హెల్మెంట్ లేకపోతే ఆ ఊరిలోకి నో ఎంట్రీ.. ఎక్కడో తెలుసా..?

హెల్మెంట్ లేకపోతే ఆ ఊరిలోకి నో ఎంట్రీ.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Helmet Rule: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా పాలనా_ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న 492 గ్రామపంచాయతీలలో గ్రామ సభల ద్వారా అరైవ్_ అలైవ్ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. నిజాం పేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాలవర్గం ఏకగ్రీవ తీర్మానం మేరకు వినూత్నంగా నో ఎంట్రీ _నో హెల్మెంట్ నందగోకుల్ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమనికి మెదక్ కలెక్టర్ ప్రతీమా సింగ్, ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ముఖ్య అతిధిగా హాజరుయ్యారు. వారికి గ్రామస్తులు పూలు చళ్ళుతు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెల్మెంట్ లు పెట్టుకుని ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించరు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

గ్రామ ప్రజల ప్రాణ రక్షణ ద్యేయంగా నంద గోకుల్ గ్రామస్తులు చేసిన ఆలోచన బాగుందని జిల్లా ప్రజలు అందరు నందగోకుల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామ పంచాయతీలలో నో హెల్మెంట్ నో ఎంట్రీ అనే కార్యక్రమన్ని చెపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. శిరస్త్రాణం (హెల్మెట్), సీట్‌ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.

Advertisement

Also Read: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్ దందా.. తెలంగాణ ధాన్యంపై వేరే రాష్ట్రాల కన్ను..!

రోడ్డు ప్రమాదాల ద్వారా..

ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఖచ్చితంగా శిరస్త్రాణం ధరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదు అని సూచించారు. మెదక్ ఎస్పీ డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 1,70,000 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందితే.. తెలంగాణలో 7000 మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మెదక్ జిల్లాలో హత్యలు అత్యాచారాలు మెదక్ జిల్లాలో సంవత్సరంలో 30 జరిగితే.. రోడ్డు ప్రమాదాల ద్వారా350 మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

కానిస్టేబుల్ మిమిక్రీ..

Advertisement

రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం మద్యం సేవించి వాహనాలు నడపడం సీటు బెల్టు పెట్టుకోకపోవడం తదితర కారణాలవల్ల చాలామంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ నందగోకుల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రతిజ్ఞ చేశారు. హెల్మెట్ వాడకం పై ఓ కానిస్టేబుల్ మిమిక్రీ అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ తాసిల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్ సర్పంచ్ పాతూరు భాను , ఎంపీడీవో రాజిరెడ్డి, సీఐ వెంకటరా రాజా గౌడ్, డీఎస్పీ నరేందర్ గౌడ్, సంబంధిత పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.

Also Read: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఆరోజు కాంగ్రెస్ చిట్టా విప్పుతా అంటున్న గులాబీ బాస్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×